![]() |
![]() |

జబర్దస్త్ వేదిక ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. అసలు ఊరు పేరు తెలియని వాళ్ళని కూడా సెలబ్రిటీస్ ని చేసేసింది. ఐతే ఇప్పుడు లేటెస్ట్ గా రిలీజ్ ఐన జబర్దస్త్ ప్రోమో చూస్తే అందులో యాంకర్ రష్మీ, కమెడియన్ నూకరాజు చేసిన కామెంట్స్ చాలామందిని బాధపెట్టేలా ఉన్నాయి. వాళ్ళేదో డైలాగ్ చెప్పేసి ఫన్ క్రియేట్ చేయాలనుకున్నారు కానీ వర్కౌట్ అవలేదు. జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమోలో నూకరాజు స్టేజి పైకి వచ్చి.. “ ఈ సోషల్ మీడియా నాకు అంటే చిరాకు వచ్చేస్తోందిరా.. ఎవరుపడితే వారు ఏవో వీడియోలు చేయడం, ఫేమస్ అయిపోవడం..” అనేసరికి యాంకర్ రష్మీ అందుకుని .. “ఆ వెంటనే శ్రీదేవి డ్రామా షోకి వచ్చేయడం” అని పంచ్ వేసింది. ఐతే వీరి మాటలు కాసేపు నవ్వుకోవడానికి బాగానే ఉన్నా కూడా అది అందరి మీద నెగటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.
వీళ్ళ మాటల్ని బట్టి చూస్తే ఇటీవలి కాలంలో శ్రీదేవి డ్రామా కంపెనీ షో ద్వారా ఫేమ్ అయినవారిలో గాజువాక కండక్టర్ ఝాన్సీ, బంగారం, నెల్లూరు కవిత, భాను ఇలా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి శ్రీదేవి డ్రామా కంపెనీ ఓ స్టేజి క్రియేట్ చేసి ఫేమ్ ఇచ్చింది. ఇక రష్మీ కామెంట్స్ విన్న నెటిజన్స్ మాత్రం ఊరుకోలేదు. "ఎవరు పడితే వారు వీడియోలు చేయడం అని ఎగతాళిగా మాట్లాడి చిన్నచూపు చూస్తున్న మీరు కూడా ఒకప్పుడు ఆ లెవెల్ నుంచి వచ్చిన వాళ్ళే కదా...మీ స్కిట్ లో డైలాగ్స్ అలాంటి వారి మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయి. ఇంకోసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి రష్మీ అండ్ నూకరాజు " అంటూ ఫైర్ అవుతూ కామెంట్స్ చేస్తున్నారు.
![]() |
![]() |